Published On:

Pawan Kalyan: అఖండ గోదావరి ప్రాజెక్ట్.. పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: అఖండ గోదావరి ప్రాజెక్ట్.. పవన్ కీలక వ్యాఖ్యలు

Akhanda Godavari project: అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులకు రాజమండ్రి వద్ద శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. రూ. 94.44 కోట్ల వ్యయంతో 2027 గోదావరి పుష్కరాల సమయానికి రాజమండ్రి వద్ద గోదావరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం. అఖండ గోదావరి ప్రాజెక్ట్ తో పర్యాటకులు పెరుగుతారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నాం అని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది కేవలం ఒక పదం కాదని, డబుల్ పవర్ అని పేర్కొన్నారు. డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్రంలో శక్తివంతమైన సర్కార్ ఉన్నా, కేంద్రంలోనూ అలాగే ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ డబుల్ ఇంజిన్ పవర్ కనిపిస్తోందని వెల్లడించారు. ఎన్డీఏ ఉన్నన్ని రోజులు అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అనంతరం రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు. ప్రసంగం ప్రారంభంలో పలువురిని విష్ చేశారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి: