Amit Shah: రేపు తెలంగాణకు హోంమంత్రి అమిత్ షా

Amit Shah Tour In Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిజామాబాద్ కంటేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి. శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే మహా బహిరంగ సభలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య పాల్లొని ప్రసంగం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.