Published On:

Car Drive On Railway Track: రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ యువతి హల్‌చల్

Car Drive On Railway Track: రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ యువతి హల్‌చల్

Young Lady car drive On Railway Track In rangareddy dist for reels: రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఆమె నిర్వాకంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగులపల్లి-శంకర్‌పల్లి మార్గంలో పట్టాలపై యువతి కారు నడిపింది. కారును అడ్డగించిన స్థానికులను చాకుతో బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే రీల్స్ కోసమే రైల్వే ట్రాక్‌పై కారు నడిపినట్లు తెలుస్తోంది.

 

వివరాల ప్రకారం.. లక్నో చెందిన యువతి రబిక సోనీ మతిస్థిమితం లేదని, రీల్స్ పిచ్చితో యువతి కారు డ్రైవింగ్ చేసినట్లు  శంకర్ పల్లి పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే ఆ యువతిని అదుపులోకి తీసుకొని 108 వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించింది. కాగా , ఎదురుగా వస్తున్న ఓ రైలు లోకో పైలట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. అతను చాకచక్యంగా రైలును ఆపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: