Cabinet Meeting: కేంద్ర కేబినెట్ భేటీలో యువతకు వరాలు

Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలతోపాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అలాగే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథాకానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అలాగే రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం అందించాలని అనుకుంటోంది.
అందుకుగాను దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. మరోవైపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను రూ. 1.07 లక్షల కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అన్ని రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం దృష్టి పెట్టింది. ఇక పరమకుడి- రామనాథపురం జాతీయ రహదారికి నిధులు కేటాయించింది. నాలుగు లేన్లుగా విస్తరించేందుకు గాను రూ. 1853 కోట్లు కేటాయించింది. అలాగే రామేశ్వరానికి కనెక్టివిటీని మరింత పెంచేందుకుగాను ఈ హైవే నిర్మాణం తోడ్పడుతోంది.