Minister Kishan Reddy: రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కిషన్ రెడ్డి భేటీ

Kishan Reddy Meets Minister Ashwini Vaishnaw: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్ పనులు, పురోగతిపై చర్చలు జరిపారు. రైల్వే పనులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. త్వరలోనే తెలంగాణ అంతటా మెమూ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ మెమూ రైళ్లను నడిపించనున్నామని వివరించారు. అలాగే వచ్చే ఏడాది 2026 మే నుంచి కాజీపేట ఆర్ఎంయూలోనే మెమూ కోచ్ ల ఉత్పత్తి జరగుతుందన్నారు. ఈ మేరకు కోచ్ ల తయారీ, వాడకం వంటి వివరాలను కిషన్ రెడ్డికి రైల్వేమంత్రి చెప్పారు. రూ. 716 కోట్లతో కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు. అలాగే రైల్వే పరంగా కాజీపేట స్టేషన్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్ట్ పనులు, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.