Home / Bandi Sanjay
KTR Sends Legal Notice to Bandi Sanjay: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, తనని రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులు పంపించారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “మాజీ మంత్రి కేటీఆర్ తనకు నోటీసులు ఇచ్చినట్టు మీడియాలో చూశాను. నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాళ్లు […]
ఎర్రచందనం దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి కేసిఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని, ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నిజ స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలని దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో బండి ప్రత్యేక పూజలు చేశారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాలకి చెందిన డికె అరుణని ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్కి కార్యదర్శిగా చోటు దక్కింది.
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్ష మార్పుపై జరుగుతున్న చర్చ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తమ పార్టీలో లీకులకు తావుండదని బండి సంజయ్ అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.