Published On:

GST: గుడ్ న్యూస్.. కేంద్రం నిర్ణయంతో తగ్గనున్న ధరలు

GST: గుడ్ న్యూస్.. కేంద్రం నిర్ణయంతో తగ్గనున్న ధరలు

Union Government Decided To Change GST Slabes: మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆదాయ పన్నుల రాయితీల రూపంలో వారికి ఉపశమనం కల్పించిన కేంద్రం.. పేదలపై కూడా దృష్టి పెట్టింది. వస్తుసేవల పన్నుని (జీఎస్టీ) తగ్గించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లలో ఉన్న నిబంధనలను మార్పు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 12 శాతం జీఎస్టీ స్లాబ్ ను పూర్తిగా తొలగించడం లేదా 12 శాతం పన్ను విధించబడే వస్తువులను 5 శాతంలోకి చేర్చడం వంటి అంశాలను కేంద్రం పరిశీలిస్తోంది.

దీనివల్ల మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలు ఉపయోగించే టూత్ పేస్ట్, టూత్ పౌడర్, డుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు, వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్ లు, గీజర్లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, రూ. 1000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ. 500 నుంచి రూ. 1000 మధ్య ధర కలిగిన పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్పులు అమలు చేస్తే ఈ వస్తువులు చాలా వరకు తక్కువ ధరకే వస్తాయి. మరోవైపు ప్రభుత్వం సరళీకృతమైన, సులభంగా పాటించే జీఎస్టీని కూడా పరిశీలిస్తోంది.

దీనివల్ల ప్రభుత్వంపై రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు భారం పడుతుందని తెలుస్తోంది. అయితే వినియోగం పెరిగితే జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని కేంద్రం నమ్ముతోంది. మరోవైపు కేంద్రం ఈ చర్యలకు ఒప్పుకున్నా రాష్ట్రాలు ఏ విధంగా నడుచుకుంటాయో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: