Thug Life : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘థగ్ లైఫ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kamal Haasan Movie Thug Life Released OTT: తమిళ్ స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తగ్ లైఫ్’. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా.. హై-ఆక్టేన్ తమిళ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో సిలంబరసన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు నటించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించగా.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ నిర్మించింది. ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తుండగా.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.