Meena Joins BJP: బీజేపీలోకి హీరోయిన్ మీనా..?

Heroine Meena May join In BJP: స్టార్ హీరోయిన్ ఢిల్లీలో పలువురు ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను మీనా నిన్న కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్తు నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతుండగా.. ఆమె త్వరలోనే బీజేపీలో చేరుతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే- బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. అధికారాన్ని సొంతం చేసుకోవాలని కాషాయ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని పలువురు సినీ, రాజకీయ, పలు రంగాల ప్రముఖులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే మీనా ఢిల్లీకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నారని టాక్.