AP BJP President: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్

Party President Election Notification: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 1న బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎన్నిక నోటిఫికేషన్ జారీతో పాటు అధ్యక్ష ఎన్నిక ఓటర్లను కూడా ప్రకటిస్తామన్నారు.
రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరణ, తర్వాత గంటపాటు నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం జులై 1న పోలింగ్, రాష్ట్ర అధ్యక్ష పేరు ఖరారు ప్రక్రియ జరగనుంది. కాగా కార్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో పురంధేశ్వరి కొనసాగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పదవి రేసులో ఈసారి ఎక్కువగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఎవరికి పదవి దక్కనుందో మరి.