Schools Bandh: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్.. ఎందుకంటే?

Schools Bandh in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేస్తున్నారు. అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై నిరసన తెలుపుతూ నేడు పాఠశాలలు బంద్ పాటిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ మేరకు తల్లిదండ్రులు ఫోన్లకు ఇప్పటికే మెసేజ్ రూపంలో పంపించారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ ఆవేదన తెలిపేందుకే అని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వెల్లడించాయి. అయితే పలు చోట్ల పాఠశాలలు ఓపెన్ చేశారు.
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా అనవసరంగా తనిఖీలు, నోటీసులు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో కొంతమంది అధికారుల తీరు సరిగా ఉండడం లేదని విమర్శలు చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వంతో చర్చించి నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నాయి.
కాగా, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైతం తల్లికి వందనం పథకం కింద సాయం అందుతుంది. దీంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ప్రతిభా అవార్డులు కూడా అందిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రైవేట్ పాఠశాలల యాజమానయ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.