Amit Shah: మాతృభాషను ఎప్పటికీ మర్చిపోవద్దు

Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కానీ మన భాషలోనే మాట్లాడితేనే బాగుంటుందని తెలిపారు. మాతృభాషను గౌరవించకపోవడం బానిసత్వమే అవుతుందని పేర్కొన్నారు. విదేశీ భాషలను గౌరవించాలని కానీ.. మాతృభాషను మర్చిపోవద్దన్నారు.
“ఓ వ్యక్తి తన భాషను గౌరవించకపోతే, తన భాషలో మాట్లాడకపోతే, తన ఆలోచన విధానాన్ని మాతృభాషలో వెల్లడించకపోతే బానిస మనస్తత్వం నుంచి బయటపడం. మనం ఏ భాషకు వ్యతిరేకం కాదు. విదేశీ భాషను వ్యతిరేకించవద్దు. కాని మాతృభాషను గౌరవించాలి. మన భాషలోనే ఆలోచించాలి. అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. మన వారసత్వాన్ని కాపాడేది భాష మాత్రమే” అని అన్నారు.