Fire Accident: గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం

Tirupati Govindaraja Swamy Temple: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగి రెండు షాపులు దగ్ధం అయ్యాయి. ఆ మంటలు కాస్త ఆలయం ముందు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు అంటుకుని కొంతమేర కాలిపోయాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ప్రమాదంలో గోవిందరాజస్వామి ఆలయం వెలుపల పందిళ్లు కొంతమేర కాలిపోయాయి. మరోవైపు అగ్నిప్రమాదంలో షాపులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో ఆలయం వద్ద భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆలయం వెలుపలు కాలిపోయిన పందిళ్లను మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.