Indrakeeladri: ఇంద్రకీలాద్రి పై వృద్దులు, దివ్యాంగులకు పోలీసుల సేవలు
నవరాత్రులసందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే వీరిలో వృద్ధులు మరియు దివ్యాంగులు పడిన ఇబ్బందులను గమనించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటావారి కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేయించారు
Vijayawada: నవరాత్రుల సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే వీరిలో వృద్ధులు మరియు దివ్యాంగులు పడిన ఇబ్బందులను గమనించిన ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటావారి కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేయించారు
వృద్ధులు మరియు దివ్యాంగులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశం తో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, వారికి సహకరించాలని సిబ్బందికి సూచించారు. వారికి త్వరగా దర్శనం అయ్యేవిధంగా వారికి సహకరించాలని, ప్రేమపూర్వకంగా నడుచుకోవాలని ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి తగినట్లుగానే పోలీసు సిబ్బంది వీరి పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వృద్దులు, దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయడం, వారిని క్యూ లైన్లలోకి తీసుకు వెళ్లడం చేస్తున్నారు.
నగర పోలీస్ కమీషనర్ ప్రత్యేకించి వృద్ధులు మరియు దివ్యాంగులు కోసం చేసిన ఏర్పాట్ల పై దర్శనానికి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు పోలీసు సిబ్బంది సహకరించి దర్శనం అయ్యేవిధంగా చేస్తున్నారని వారంటున్నారు.