Last Updated:

Vijayawada: విజయవాడలో డాక్టర్ కుటుంబం అనుమానాస్పద మృతి

విజయవాడ గురునానక్ నగర్ లో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కలకలం రేపింది. వీరిలో డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) విగత జీవుల్లా కనిపించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.

Vijayawada: విజయవాడలో డాక్టర్ కుటుంబం అనుమానాస్పద మృతి

Vijayawada: విజయవాడ గురునానక్ నగర్ లో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కలకలం రేపింది. వీరిలో డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) విగత జీవుల్లా కనిపించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.డాక్టర్ శ్రీనివాస్ ఇంటి బయట ప్రాంగణంలో చెట్టుకు ఉరి వేసుకోగా ఇతర కుటుంబ సభ్యులు నలుగురు పీక కోయటంతో మృతి చెందినట్టు గుర్తించారు. నలుగురిని హత్య చేసి శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడా లేక అందరినీ ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఘటనా స్దలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో  దర్యాప్తు జరుపుతున్నారు.