Last Updated:

CM Jagan: విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

విజయవాడలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు.

CM Jagan: విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

CM Jagan: విజయవాడలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు.

అంటరానితనం రూపం మార్చుకుంది..(CM jagan)

అంతకుముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహం సామాజిక న్యాయ మహా శిల్పంగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌గా పేర్కొన్నారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టి అంటే అమెరికా గుర్తొస్తుందని.. ఇక నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తుకు వస్తుందన్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు. అంటరానితనం రూపం మార్చుకుందని అన్నారు. పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని కోరుకోవడం కూడా అంటరానితనమే.పేదవాళ్లు ఎప్పటికీ పేదవాళ్లుగానే ఉండాలట.పేద కులాలను వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలట.పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు.అమరావతిలో పేదలకు చోటు లేకుండా చేయాలనుకోవడం అంటరానితనమే.పథకాల అమలులో కూడా వివక్ష చూపడం అంటరానితనమే అని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పేదల కోసం సెంటు భూమి ఇచ్చింది లేదన్నారు. అంబేద్కర్ భావజాలం ఈ పెత్తందార్లకు నచ్చదన్నారు.పెత్తందార్ల కళ్లు తెరిపించడం కోసమే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసామన్నారు.ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం.మరణం లేని మహనీయుడు అంబేద్కర్ అట్టడుగు వర్గాల చరిత్రను మార్చిన ఘనుడు అంబేద్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు.