Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన – అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోని అరెస్ట్
Allu Arjun Bouncer Antony Arrest: అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు రెండున్న గంటల పాటు విచారణ జరిగింది. ఇందులో కీలకమైన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు లేక మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా బౌన్సర్ ఆంటోనిని పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అతడే ప్రధాన కారకుడిగా పోలీసలుగుర్తించారు. కాగా ఆంటోని బౌన్సర్ల ఆర్గనైజర్ గా వ్యవహరిస్తుంటాడిన తెలుస్తోంది. కాగా కాసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల స్టేషన్ నుంచి ఇంటికి బయలుదేరారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య బన్నీని ఇంటికి తరలిచారు. కాగా సంధ్య థియేటర్ ఘటనలో సోమవారం అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే బన్నీ విచారణ ముగిసింది.
BREAKING: Allu Arjun bouncer Antony ARRESTED by police👮🏻
— Manobala Vijayabalan (@ManobalaV) December 24, 2024
దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ జరిగింది. ఇందులో సంధ్య థియేటర్ కు అనుమతితోనే వచ్చారా? అని పోలీసులు ప్రశ్నించగా దీనిపై సరైన సమాధానం చెప్పలేకపోయారు. రేవతి చనిపోయినట్టు తెలిసిన ఎందుకు సినిమా చూస్తూనే ఉన్నారని ప్రశ్నించారు. దీనికి కూడా అల్లు అర్జున్ మౌనం వహించినట్టు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటన వీడియో చూపిస్తూ ప్రశ్నించగా.. దానిపై అల్లు అర్జున్ సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం.