Manchu Manoj: మంచు ఫ్యామిలీలో మళ్లీ మొదలైన రచ్చ – సోదరుడు విష్ణుపై మంచు మనోజ్ ఏడు పేజీల ఫిర్యాదు
Manchu Manoj Complaint on Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మళ్లీ రచ్చ మొదలైంది. తన అన్నయ్య మంచు విష్ణుపై పహడీషరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ మరోసారి ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై ఏడు పేజీల ఫిర్యాదు చేశాడు. ఇందులో వినయ్ అనే వ్యక్తి పేరు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా తన అన్నయ్య మంచు విష్ణు వల్ల తనకు ప్రాణహాని ఉందని పిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదంలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 10న జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త చోటుచేసుకుంది. మంచు మనోజ్, మంచు మోహన్ బాబులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
జల్‌పల్లి ఇంటి గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు మనోజ్. ఈ వ్యవహరంలో పోలీసులు ఫిర్యాదు, హత్యయత్నం దాడికి వరకు వెళ్లింది. ఈ ఘటన వల్ల ఒత్తిడికి గురైన మోహన్ బాబు ఓ రిపోర్టర్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనలో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన ముందస్తు బెయిల్ పటిషన్ విచారించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. ఈ క్రమంలో రేపు డిసెంబర్ 24 మోహన్ బాబుకు మరోసారి నోటీసులు అందనున్నాయి. వీటిపై ఆయన స్పందించకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.