India Women vs West Indies Women: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు దిశగా?
India Women vs West Indies Women 2nd ODI: భారత్, వెస్టిండీస్ ఉమెన్స్ జట్లు మధ్య మరో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు బరిలోకి దిగింది. భారత్ ఓపెనర్లు స్మృతి మందనా(53, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీకా రావల్(57) పరుగులతో రాణించారు. అయితూ దూకుడుగా ఆడుతున్న స్మృతి మందాన రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డియోల్(10) నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 22 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది.
భారత్: స్మృతి మంధాన, ప్రతీకా రావల్, డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా, రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్, టిటాస్ సాధు, ప్రియా మిశ్రా, రేణుకాసింగ్ ఠాకూర్.
వెస్టిండీస్: హేలీ మాథ్యూస్(కెప్టెన్),క్వినా జోసెఫ్, రషదా విలియమ్స్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, షెమైన్, ఆలియా అలీన్, జైదా జేమ్స్, కరిష్మా రామ్ హారక్, షామిలియా కానెల్, అపీ ప్లెచర్.