Last Updated:

Pushpa 2: అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’కి షాక్‌ – థియేటర్ల నుంచి సినిమా అవుట్! అసలేం జరిగిందంటే..

Pushpa 2: అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’కి షాక్‌ – థియేటర్ల నుంచి సినిమా అవుట్! అసలేం జరిగిందంటే..

Pushpa 2 REMOVED from all PVR INOX chains: ‘పుష్ప 2’కి పీవీఆర్‌, ఐనాక్స్ షాకిచ్చాయి. మూవీ విడుదలై మూడు వారాలు అవుతుంది. ఇప్పటికీ థియేటర్లో ఈ సినిమా సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. అయితే ఉన్నట్టు పుష్ప 2ను థియేటర్ల నుంచి తిసేస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు సినీ విశ్లేషకుడు మనోబాలా విజయ్‌బాలన్‌ ట్వీట్‌ చేయడంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా పుష్ప 2 కలెక్షన్స్‌లో యమ జోరు చూపిస్తుంది. అతితక్కువ టైంలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ చేస్తూ ట్రేడ్ వర్గాలనే సర్‌ప్రైజ్‌ చేస్తుంది. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్‌ రాబట్టి సంచలనం సృష్టించింది.

ముఖ్యంగా హిందీ బాక్సాఫీసు పుష్పరాజ్‌ రూల్‌ చేస్తున్నారు. అక్కడ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ మళ్లీ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో కలెక్షన్లలో పుష్పరాజ్‌ అక్కడ అగ్ర హీరో రికార్డు అతి తక్కువ టైంలోనే బ్రేక్‌ చేశాడు. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌ల పేరిట ఉన్న రికార్డును కేవలం 6 రోజుల్లోనే బ్రేక్‌ చేశాడు. ఇప్పటి వరకు పుష్ప 2 అక్కడ రూ. 618 కోట్ల నెట్‌ రాబట్టింది. అత్యంత వేగంగా 6 వందల కోట్ల రాబట్టిన సినిమా పుష్ప 2 రికార్డు కెక్కింది. అంతేకాదు తొలి డబ్బింగ్‌ సినిమా కూడా పుష్ప రికార్డు క్రియేట్‌ చేసింది.

ఇక తెలుగు కంటే నార్త్‌లోనే ఎక్కువ కలెక్షన్స్‌ చేసిన ఈ సినిమాను అక్కడ పీవీఆర్‌, ఐనాక్స్‌లు షాకిచ్చాయట. సడెన్‌ సినిమా ప్రదర్శనని నిలిపివేశాయట. అంతేకాదు పుష్ప 2 థియటర్ల నుంచి తిసేస్తున్నట్టు అక్కడ ప్రచారం జరిగింది. దీనిపై సినీ విశ్లేషకులు మనోబాలా విజయ్‌బాలన్‌ సైతం ట్వీట్‌ చేశారు. పీవీఆర్‌ ఐనాక్స్‌ నుంచి పుష్ప 2ని తిసేస్తున్నట్టు పోస్ట్‌ చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే.. సినిమా థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్మాతలను చెప్పారట.

ఈ నిబంధనను మేకర్స్‌ ఒప్పుకొలేదట. దీంతో ఉన్నట్టుండి పుష్ప 2 ప్రదర్శనలను నిలిపివేయాలని పీవీఆర్‌, ఐనాక్స్‌ నిర్ణయించారు. కొన్ని థియేటర్ల నుంచి సినిమాను తిసేయడంతో మేకర్స్‌ వెనక్కి తగ్గి థియేటర్ యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఈ చర్చలు సఫలం అవ్వడంతో తిరిగి పుష్ప 2ను ప్రదర్శించారట. మొదటి పుష్ప 2 ను థియేటర్ల నుంచి తీసేస్తున్నట్టు ట్వీట్‌ చేసిన మనోబాలా ఆ తర్వాత కాసేపటికి ఒప్పందం కుదరడంతో పుష్ప 2 షోలు ఒపెన్‌ అవుతున్నట్టు వెల్లడించారు.