Last Updated:

Border-Gavaskar Trophy: నేటి నుంచి బాక్సింగ్ డే టెస్ట్..ఓపెనర్‌గా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ!

Border-Gavaskar Trophy: నేటి నుంచి బాక్సింగ్ డే టెస్ట్..ఓపెనర్‌గా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ!

Border-Gavaskar Trophy A Boxing Day Test awaits: బోర్డర్ గవాస్కర్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య నేటి నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్న్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా దిగనుండగా.. కేఎల్ రాహుల్ వన్‌డౌన్ ఆర్డర్‌లో రానున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. అయితే శుభమన్ గిల్ మాత్రం ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు.

మెల్న్‌బోర్న్ మైదానంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించేందుకు ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ భారత్ ఘన విజయం సాధించగా.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి చవిచూసింది. ఇక, గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి.

మెల్న్‌బోర్న్ మైదానం భారత్‌కు కలిసివచ్చింది. అంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి రికార్డు నెలకొల్పాలని భావిస్తోంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేపట్టిన జట్లు అత్యధిక విజయాలు సాధించాయి. ఇప్పటివరకు 117 మ్యాచ్‌లు జరగగా.. 57 సార్లు గెలవగా.. మొదట బౌలింగ్ వేసిన జట్టు 42 సార్లు విజయాలు సాధించాయి. అంతేకాకుండా ఈ మైదానంలో భారత్ బౌలర్ బుమ్రాకు రికార్డు ఉంది. ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు.

భారత జట్టు (అంచనా)
యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (WC), నితీశ్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, ఆకాశ్‌ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు:
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మార్నస్ లాబుస్‌చగ్నే, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ (WC), పాట్ కమిన్స్ (C), నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్.