Last Updated:

Trsiha: నా కొడుకు చనిపోయాడు – హీరోయిన్ త్రిష ఎమోషనల్ పోస్ట్..!

Trsiha: నా కొడుకు చనిపోయాడు – హీరోయిన్ త్రిష ఎమోషనల్ పోస్ట్..!

Trisha Shared Emotional Post: హీరోయిన్‌ త్రిష ఇంట విషాదం చోటుచేసుకుంది. క్రిస్మస్‌ పండుగ వేళ ఉదయాన్నే చేదు వార్త చెప్పింది. ఈ రోజు వెకువజామున తన కుమారుడు చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని, నా కుటుంబమంత షాక్‌లో ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషాద వార్తను షేర్‌ చేసుకుంది. త్రిషకు పెట్‌ డాగ్‌ (పెంపుడు కుక్క) ఉన్న సంగతి తెలిసిందే. దాని పేరు జొర్రో. ఎప్పుడూ జొర్రోతో కలిసి ఆడుకుంటున్న ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ మురిసిపోయింది.

అయితే ఈ జొర్రో ఈరోజు ఉదయాన్ని కన్నుమూసిందంటూ త్రిష భావోద్వేగానికి లోనయ్యింది. “నా కొడుకు జొర్రో ఈ క్రిస్మస్‌ నాడు ఉదయం తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి తెలిసిన వాళ్లకు.. జొర్రో నాకు ఎంత ముఖ్యమే తెలుసు. నేను, నా ఫ్యామిలీ చాలా బాధలో ఉన్నాం. దీని నుంచి బయటపడటానికి మాకు సమయం పడుతుంది. అప్పటి వరకు నేను అందుబాటులో ఉండను” అంటూ పోస్ట్‌ షేర్ చేసింది.

ప్రస్తుతం త్రిష వరుస ప్రాజెక్ట్స్‌ బిజీగా ఉంది. 20 ఏళ్లుగా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష కొంతకాలం నటనకు బ్రేక్‌ ఇచ్చింది. రీఎంట్రీ లేడీ ఒరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ తమిళంలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్‌ హీరోల సరసన పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తుంది. తెలుగు మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభరలో నటిస్తూనే తమిళంలో అజిత్‌ ‘విడమూయార్చి’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తుంది. దీనితో పాటు సూర్య కమల్‌ హాసన్‌ కొత్త సినిమాలోనే ఈమే హీరోయిన్‌. ఇలా తెలుగు, తమిళంలో భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తూ రీఎంట్రీలో ఫుల్‌ బిజీ అయిపోయింది.

ఇవి కూడా చదవండి: