Honda Activa 125: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. న్యూ లుక్‌లో కొత్త యాక్టివా.. స్మార్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్‌గా వచ్చేసింది..!
Honda Activa 125: హోండా మోటర్ సైకిల్, స్కూటర్ ఇండియా తన పాపులర్ స్కూటర్ యాక్టివా 125 అప్‌గ్రేడ్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ OBD 2B నిబంధనలకు (OBD2B-కంప్లైంట్) అనుకూలంగా మారింది. ఈసారి ఈ స్కూటర్‌లో కొత్త 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే కూడా ఉంది. అయితే మునుపటి మోడల్‌లో LCD డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ డిస్‌ప్లే హోండా రోడ్‌సింక్ యాప్‌కి కూడా కనెక్ట్ అవుతుంది. అంటే కాల్ అలర్ట్, నావిగేషన్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్‌లో కనిపిస్తాయి. ఈ స్కూటర్‌లో టైప్ C యూఎఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
Honda Activa 125 Price And Variants
కొత్త హోండా యాక్టివా 125 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.94,422 నుండి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ హోండా (HMSI) డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. హోండా యాక్టివా 125 అప్‌డేటెడ్ మోడల్ 6 కలర్స్‌లో పరిచయం చేశారు. కొత్త మోడల్ కూడా పాత మోడల్ కంటే దాదాపు రూ. 14,000 వరకు ధర పెరిగింది.
Honda Activa 125 Engine
ఇంజన్ గురించి మాట్లాడితే కొత్త Activa 125 123.9cc ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 8.4 బిహెచ్‌పి పవర్, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌లో కంపెనీ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను కూడా అందించింది. కొత్త స్కూటర్ ఇప్పుడు OBD 2B నిబంధనల ప్రకారం అప్‌డేట్ అయింది. ఇంతకుముందు స్కూటర్‌లలో ఇచ్చిన ఇంజిన్‌నే దీనిలో కూడా అందించారు. డిజైన్ గురించి మాట్లాడితే కొత్త Activa 125 డిజైన్‌లో ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయలేదు.
హోండా యాక్టివా 125 నేరుగా టీవీఎస్ జూపిటర్ 125తో పోటీపడుతుంది. ధర గురించి చెప్పాలంటే ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,405 నుండి ప్రారంభమవుతుంది. జూపిటర్ 125 దాని విభాగంలో అత్యుత్తమంగా కనిపించే స్కూటర్‌లలో ఒకటి. దాని సీటు కింద 32 లీటర్ల ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ మీరు 2 ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను సులభంగా ఉంచుకోవచ్చు. స్పేస్ పరంగా ఇది అత్యుత్తమ స్కూటర్. శక్తి కోసం ఇది 124.8cc ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 8.3పీఎస్ పవర్, 10.5ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది కాకుండా Activa 125 కూడా సుజుకి యాక్సెస్ 125 తో పోటీపడుతుంది. ఈ స్కూటర్‌లో 125 సిసి ఇంజన్ ఉంది, ఇది 8.7 పిఎస్ పవర్, 10 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అమర్చారు. ఇందులో పవర్‌తో పాటు మంచి మైలేజీ కూడా లభిస్తుంది. ఈ స్కూటర్‌ను రోజువారీ ఉపయోగం కోసం మంచి ఎంపిక. ఇందులో మీకు మంచి స్పేస్ కూడా లభిస్తుంది. యాక్సెస్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ.86 వేల నుండి ప్రారంభమవుతుంది.