Last Updated:

Pushpa 2 Kissik Song: శ్రీలీల ‘కిస్‌ కిస్‌ కిస్సిక్‌’ ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది – చూశారా?

Pushpa 2 Kissik Song: శ్రీలీల ‘కిస్‌ కిస్‌ కిస్సిక్‌’ ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది – చూశారా?

Kissik Full Video Song: విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లు చేస్తోంది. కేవలం 11 రోజుల్లోనే కేజీయఫ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల ఆల్‌టైం రికార్డు బ్రేక్‌ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడ రూ. 2వేల కోట్ల గ్రాస్‌కు చేరువలో దూసుకుపోతూ బాహుబలి 2, దంగల్‌ రికార్డుల బ్రేక్‌ చేసే దిశగా దూసుకుపోతుంది. విడుదలై మూడో వారంలోకి అడుగపెట్టింది. ఇంకా ఈ మూవీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది.

నార్త్‌ బెల్ట్‌లోనూ రికార్డు వసూళ్లు రాబడుతూ సర్‌ప్రైజ్‌ చేసింది. హిందీలో ఖాన్‌ల పేరిట ఉన్న రికార్డులు అల్లు అర్జున్‌ కొల్లగొట్టాడు. ఇప్పటి వరకు హిందీలో ఈ సినిమా రూ. 601 పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసి ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప 2 సందడి థియేటర్‌లో కొనసాగుతుండగానే మరోవైపు సినిమాలోని ఫుల్‌ సాంగ్స్‌ రిలీజ్ చేస్తూ ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది మూవీ టీం. కొన్ని రోజలు పుష్ప 2లోని ఫుల్‌ వీడియో సాంగ్స్‌ ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తూ వస్తుంది.

తాజాగా శ్రీలీల ఐటెం సాంగ్‌ని రిలీజ్ చేసింది మూవీ టీం. కాసేపటి క్రితం విడుదలైన ఈ ఫుల్‌ సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ప్రస్తుతం పాటకు మంచి వ్యూస్‌ రాబట్టింది. కిస్‌ కిస్‌ కిస్సిక్‌ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. సినిమా రిలీజ్‌కు కొన్ని రోజులు మందు లిరికల్‌ సాంగ్‌ విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ అవ్వడంతో అభిమానులంత పండగ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: