Last Updated:

Sonia Akula: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్‌ సోనియా ఆకుల – ఫ్రేంలో వారిద్దరు మిస్‌!

Sonia Akula: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్‌ సోనియా ఆకుల – ఫ్రేంలో వారిద్దరు మిస్‌!

Bigg Boss 8 Sonia Wedding: బిగ్‌బాస్‌ 8 కంటెస్టెంట్‌ సోనియా ఆకుల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కరీంనగర్‌ మంథనికి చెందిన సోనియా రామ్‌ గోపాల్‌ వర్మ దిశ సినిమాతో గుర్తింపు పొందింది. ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌ ఆఫర్‌ అందుకుని సీజన్‌ 8లో సందడి చేసింది. ఉన్నది నాలుగు వారాలే అయినా వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. తరచూ హౌజ్‌లో కంటెస్టెంట్స్‌తో గొడవలు పడుతూ ఉండేది. టాస్క్‌లపై కంటే ఇతరులపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టేది. ముఖ్యంగా నిఖిల్‌, పృథ్వితో ఉంటూ అందరిపై గాసిప్స్‌ క్రియేట్‌ చేస్తుంది.

ఆటలో కంటే కాలక్షేపంపైనే ఎక్కువ ఫోకస్‌ చేసి ఫైనలిస్ట్‌ ఉండాల్సిన ఆమె నాలుగో వారినికే బయటకు వచ్చేసింది. ఇక హౌజ్‌ నుంచి బయటకు రాగానే ప్రియుడి యష్‌ని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. ఈ వేడుకకు బిగ్‌బాస్‌ సీజన్‌ 8కి చెందిన చాలామంది కంటెస్టెంట్స్‌ హాజరైన వధువరులను ఆశీర్వదించారు. రోషిణి, బెజవాడ బెబక్క, కిరాక్‌ సితా, అమర్‌-తేజస్వీని, జెస్సీ, టెస్టీ తేజతో పాటు పలువురు ఈ పెళ్లిలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రోషిణి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది. దీంతో సోనియా పెళ్లి ఫోటోలు బయటకు వచ్చాయి.

కాగా హౌజ్‌లో సోనియా నిఖిల్‌, పృథ్విలతోనే సన్నిహితం ఎక్కువగా. ఇంకా చెప్పాలంటే వీరి మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ట్రాక్‌ నడిచిందనే టాక్‌ కూడా వచ్చింది. అదే సోనియాకు తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చింది. హౌజ్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పి నిఖిల్‌, పృథ్విలలో ట్రాయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌ నడిపిందనే నెగిటివిటీ టాక్‌ తెచ్చుకుంది. కానీ వారిని సోనియా చిన్నోడు, పెద్దోడు అంటూ ముద్దుగా పిలుచుకునేంది. హౌజ్‌లో అంత బాండింగ్‌ ఉన్న వారిద్దరు ఆమె పెళ్లికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ పెళ్లి ఫోటోల్లో వారు కనిపించకపోవడంతో పెద్దోడు, చిన్నోడు ఎక్కడ? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సోనియా పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.