Kid Playing with King Cobra: అమ్మో.. వీడు మాములోడు కాదు.. భారీ కింగ్ కోబ్రాతో ఆటలు!

Kid Playing with Long King Cobra: సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాములు పట్టేవారికి సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురువుతున్నారు. కాగా, పెద్ద పాములను చూడటానికి కొందరు భయ పడుతున్నారు. కాగా అలాంటి భయంకరమైన పాములను పట్టుకునేందుకు మరికొందరు సాహసం చేసి పాములను పట్ట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాజాగా.. భయంకరమైన కింగ్ కోబ్రా అడవులో తిరుగుతోంది. దానిని చూసి ఓ కుర్రాడు పట్టుకోవడాని ఏ మాత్రం భయపడలేదు. దానిని కట్టెతో సరదాగా ఆడుకుంటున్నాడు.
కాగా, ఆ కింగ్ కోబ్రా పొడవుగా ఉంది. ఆ కుర్రాడు కింగ్ కోబ్రాతో ఆడుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఓ అడవిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. వీడియో మాత్ర సోషల్ మీడియో భాగా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.
నాగుపాము అంటే కుర్రాడికి భయంలేదని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఒక చిన్న పామును చూస్తే భయం వేస్తోందని అంటున్నాడు. ఈ కింగ్ కోబ్రాతో చేసిన సహసం అంతా ఇంతా కాదని కామెంట్లు పెడుతున్నారు. కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైది అని తెలిసి కూడా దానితో ఆడుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రమాదకరమైన పాము బాలుడితో యుద్ధానికి దిగిందని చెప్పవచ్చు. అయినా కట్టెతో పామును అటు ఇటూ అంటుండగా, కోబ్రా దూకుడుగా ఎదుర్కొంటున్న వీడియో వైరల్ అవుతోంది. తనకు ఓపిక ఎక్కువ అని కోబ్రా అంటోంది. తనను వాడుకోకు.. మీ కుటుంబాన్ని గుర్తుంచుకుని వదిలేయాలని చెప్పుకొచ్చింది.
నేషనల్ జియోగ్రాఫిక్ తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్ కోబ్రాలు విషపూరితమైనవి. ఇవి ఎక్కువగా పొడవు ఉంటాయని పేర్కొంది. అంతేకాదు కింగ్ కోబ్రాలు నిట్టారువుగా నిలబడి శబ్ధాలు వినిపించేలా చేస్తాయని చెబుతుంటారు. ఒకవేళ ఇది కాటు వేస్తే.. కింగ్ కోబ్రా శరీరం నుంచి విడుదలయ్యే న్యూరోటాక్సిన్ ప్రభావంతో దాదాపు 20మందికిపైగా చంపడానికి సరిపోతుందని నేషనల్ జియోగ్రాఫిక్ వెల్లడించింది.