Nothing Phone 3a Pro: పెద్ద ఆఫరే భయ్యా.. నథింగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్.. డీల్ అదిరిందిగా..!

Nothing Phone 3a Pro: అమెరికన్ టెక్ బ్రాండ్ నథింగ్ ఇటీవల భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ (3a) సిరీస్‌ను విడుదల చేసింది, దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్‌లో చేర్చిన నథింగ్ ఫోన్ (3a) ప్రోని ఇప్పుడు రూ. 5000 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ ప్రయోజనం కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
నథింగ్ ఫోన్ (3a) ప్రో వెనుక ప్యానెల్లో సర్క్యులర్ మాడ్యూల్లో కెమెరా సెన్సార్, ప్రత్యేక గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంది. దీనిలో అమర్చిన LED లైట్లు నోటిఫికేషన్లు, హెచ్చరికల గురించి సమాచారాన్ని అందిస్తాయి. ట్రాన్స్‌పాంట్ బ్యాక్ ప్యానెల్ కాకుండా, ఈ ఫోన్లో 50MP సెల్ఫీ కెమెరా, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లో 5000mAh సామర్థ్యం గల బ్యాటరీ కూడా అందించారు.
Nothing Phone 3a Pro Discount Offers
8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన నథింగ్ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ రూ.32,999 ధరకు లాంచ్ అయింది. డిస్కౌంట్ తర్వాత ఇది ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది. ఏదైనా బ్యాంక్ కార్డు ద్వారా చెల్లింపుపై వినియోగదారులకు రూ. 2000 తగ్గింపు ఇస్తున్నారు. ఈ విధంగా, ఫోన్‌పై మొత్తం రూ. 5000 తగ్గింపును అందిస్తున్నారు.
పాత ఫోన్‌ను మార్చుకుంటే, ఆ మొబైల్‌పై రూ.17,300 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 1000 అదనపు తగ్గింపు అందిస్తున్నారు. ఈ తగ్గింపు పాత ఫోన్ మోడల్ , దాని స్థితిని బట్టి ఉంటుంది. నథింగ్ ఫోన్ (3a) ప్రోని గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
Nothing Phone 3a Pro Specifications
నథింగ్ ఫోన్ (3a) 6.77-అంగుళాల పూర్తి HD+ డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. మంచి పనితీరు కోసం ఈ మొబైల్లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ అందించారు. వెనుక ప్యానెల్లో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిస్కోప్ పెరిస్కోప్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ ఫోన్ 5000mAh బ్యాటరీకి 50W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- Realme 10000mAh Battery Phone: 10000mAh బ్యాటరీ.. రియల్‌మి నుంచి అతిపెద్ద పవర్ బ్యాంక్ ఫోన్.. పవర్ దట్ నెవర్ స్టాప్స్..!