Published On:

5G Budget Phones: అమెజాన్ సేల్.. జస్ట్ రూ.10 వేల లోపు ధరకే 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. లిస్ట్ లో ఏఏ బ్రాండ్ ఫోన్స్ ఉన్నాయంటే..!

5G Budget Phones: అమెజాన్ సేల్.. జస్ట్ రూ.10 వేల లోపు ధరకే 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. లిస్ట్ లో ఏఏ బ్రాండ్ ఫోన్స్ ఉన్నాయంటే..!

5G Budget Phones: ఈరోజుల్లో తక్కువ డబ్బుకు నాణ్యమైన వస్తువులు రావాలంటే కష్టమే. కానీ, స్మార్ట్ ఫోన్స్ విషయంలో మాత్రం ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్స్ వాడే వారి టేస్ట్‌కి తగ్గట్లుగా కంపెనీలు ఫోన్లను రూపొందిస్తున్నాయి. అయితే ఇప్పుడు బిజినెస్ కాంపిటేషన్‌ను దృష్టిలో పెట్టుకొని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ ప్రకటించింది. సేల్‌లో మూడు బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. వీటి డిజైన్ నుంచి ఫీచర్స్ వరకు అందిరిని ఆకర్షిస్తాయి. రూ.10వేలకు వచ్చే మంచి ఫోన్ ఏంటో చూద్దాం..!

 

Samsung Galaxy M06 5G
ఈ అమెజాన్ సేల్‌లో Samsung Galaxy M06 5G స్మార్ట్‌ఫోన్‌పై 37 శాతం డిస్కౌంట్ ప్రకటించగా.. ధర రూ.9,799కి చేరింది. మొబైల్ ఆండ్రాయిడ్ v15-ఆధారితమైనది. 191గ్రాముల బరువుతో కేవలం 8మి.మీ సన్నగా ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల PLS LCD డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 4జీబీ వరకు ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ అందించారు. 4జీబీ వర్చువల్ ర్యామ్‌తో పాటు 1.5 TB వరకు విస్తరించదగిన మెమరీ కార్డ్ స్టోరేజ్ కూడా ఉంది. 50MP + 2MP డ్యూయల్ కెమెరా మాడ్యూల్, 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా అందించారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీతో రోజువారీ పనులను సులభంగా నిర్వహిస్తుంది. డీల్స్‌లో ఉచితంగా రూ. 200 కూపన్, ICICI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా క్యాష్‌బ్యాక్ రూ.475 నుండి ప్రారంభమయ్యే ఉచిత EMI ఉన్నాయి.

 

itel P55 5G
ఐటెల్ P55 5G అనేది డబ్బుకు విలువ కలిగిన ఫోన్, ఇప్పుడు పూర్తిగా ఫ్లాట్ 40శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ.7,799కే అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ v13తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల IPS డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 270ppi. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా గురించి చెప్పాలంటే 50MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ కోసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ అందించారు. అదనపు ఆఫర్‌లలో HDFC బ్యాంక్ ఆఫర్‌లు, EMI, GST ఇన్‌వాయిస్ ప్రయోజనాలు ఉంటాయి.

 

Redmi A4 5G
Redmi A4 5G ప్రపంచవ్యాప్తంగా స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2, 6.88-అంగుళాల LCD డిస్‌ప్లేతో విడుదల చేయడంతో వార్తల్లో నిలిచింది. 27శాతం డిస్కౌంట్ తర్వాత రూ.7,999 ధరకు లభించే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ v14పై రన్ అవుతుంది. డిస్‌ప్లే 120Hz, TÜV తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ రేటింగ్‌లతో ఉంటుంది. ఇది 50MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. 5MP ఫ్రంట్ సెన్సార్‌ ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుతుంది. పవర్ కోసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీ అందించారు. క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ప్రమోషన్‌లు కూడా ICICI బ్యాంక్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.