Last Updated:

World Largest Camera: ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. దీని సైజు ఎంతో తెలుసా..?

అమెరికా ఇంజినీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు. ఎస్‌ఎల్‌ఏసీ నేషనల్ యాక్సిలరేటర్‌ లేబొరేటరీలో ఈ అతిపెద్ద కెమెరాను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం వారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారు.

World Largest Camera: ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. దీని సైజు ఎంతో తెలుసా..?

World Largest Camera: సాధారణంగా మనం ఉపయోగించే కెమెరా మహా అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న వస్తువును క్యాప్చర్ చేస్తుంది. కానీ ఈ కెమెరా మాత్రం 15 మైళ్ల దూరంలో ఉన్న అతిచిన్న గోల్ఫ్ బాల్ ను సైతం చిత్రీకరిస్తుంది. అంత దూరంలో ఉన్న దాన్ని ఎలా ఫొటో తియ్యగలం అని అనుకుంటున్నారు కదా.. ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరాతో ఇది సాధ్యమేనండోయ్. మరి ఈ కెమెరాను ఎవరు ఆవిష్కరించారు ఎక్కడుంది ఇది అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చూసెయ్యండి.

అమెరికా ఇంజినీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు. ఎస్‌ఎల్‌ఏసీ నేషనల్ యాక్సిలరేటర్‌ లేబొరేటరీలో ఈ అతిపెద్ద కెమెరాను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం వారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. కాగా ఈ ఎల్‌ఎస్‌ఎస్‌టీ డిజిటల్‌ కెమెరా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ అన్ని భాగాలనైతే అమర్చారు కానీ దీనిని ఆపరేట్ చేసి ఫోటోలు తీసేందుకు ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు ఈ కెమెరా రూపకర్తలు.

ఎల్‌ఎస్‌ఎస్‌టీ కెమెరా అంటే ఏంటి?
ఎల్‌ఎస్‌ఎస్‌టీ అంటే ‘లార్జెస్ట్ సినాప్టిక్‌ సర్వే టెలిస్కోప్‌’ డిజిటల్ కెమెరా అని అర్థం. ఉత్తర చీలిలోని 2,682 మీటర్ల ఎత్తయిన పర్వతం సెర్రో పచోన్‌ అంచున 2023 ఏఫ్రిల్‌లో ఈ కెమెరాను అమర్చనున్నారు. భూమిపై పరిశోధలనకు ఈ ప్రాంతం అత్యంత అనువైందని జెమినీ సౌత్, సౌథర్న్ ఆస్ట్రోఫిజికల్ రీసెర్చ్ టెలిస్కోప్‌లు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నాయని అమెరికా ఇంజినీర్లు తెలిపారు. అత్యాధునిక ఐఫోన్‌ 14 ప్రోతో పోల్చితే ఈ డిజిటల్ కెమెరాలోని సెన్సార్లు చాలా రెట్లు అధికం. దీని ఓవరాల్ రిజొల్యూషన్‌ 3.2 గిగాపెక్సెల్స్‌ లేదా 3200 మెగా పిక్సెళ్స్. ఈ కెమెరా సహాయంతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా క్యాప్చర్ చెయ్యవచ్చు. ఈ కెమెరా చిన్న కారు సైజులో మూడు టన్నుల బరువు కలిగి ఉంటుంది.

ఇదీ చదవండి: ఇకపై పాస్‌వర్డ్‌ లేకుండానే గూగుల్ అకౌంట్‌లో లాగిన్..!

ఇవి కూడా చదవండి: