H1-B Visa 25% Dip: 25 శాతం తగ్గిన హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు.. ఎందుకో తెలుసా?

H1-B Visa applications Dip By 25 % amid Layoffs: హెచ్ 1- బీ వీసాల దరఖాస్తుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నాయి. తాజాగా, 25 శాతం తగ్గి 3,58,737కి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల చుట్టూ వివాదాలు, అనిశ్చితుల నేపథ్యంలో హెచ్ 1-బీ వీసాల డిమాండ్ గతేడాదితో పోలిస్తే తగ్గింది. అలాగే దరఖాస్తు రుసుములు ఎక్కువగా ఉండటంతో తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 120,141 మంది ఎంపికవ్వగా.. గతేడాది ఎంపికైన 135,137 మంది కంటే తక్కువని USCIS డేటా విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, యూఎస్ ప్రతి ఏడాది 85వేల హెచ్ 1- బీ వీసాలను జారీ చేస్తుంది. హెచ్ 1- బీ వీసాదారులలో ఎక్కువ మంది భారతీయులే ఉంటుండగా.. 2022లో 3,20,000 హెచ్ 1- బీ వీసాలలో 77 శాతం భారతీయ పౌరులకు మంజూరు చేశారు. 2023లో 3,86,000 వీసాలలో 72.3 శాతం వాటా ఉండడం విశేషం.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య తగ్గిందని యూఎస్సీఐఎస్ డేటా విడుదల చేసింది. ఈ వీసాను యూఎస్ కంపెనీలు నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ప్రత్యేకంగా విడుదల చేస్తాయి. వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. కానీ ప్రతీ ఏడాది తగ్గుతూ వస్తుంది. అయితే దరఖాస్తు ఖర్చులు సైతం డాలర్ 10 నుంచి డాలర్ 215కు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసంది. ఇలా అమెరికా ప్రభుత్వం దరఖాస్తు రుసుం పెంచడంతో వీసా దరఖాస్తుల సంఖ్య తగ్గిందని తెలుస్తోంది.