Last Updated:

IPL 2023 Punjab vs Kolkata: కోల్ కతా పై వరుణుడి దెబ్బ.. పంజాబ్ దే గెలుపు

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కోల్‌కతా VS పంజాబ్ టీమ్స్ ఎదురెదురు తలపడుతున్నాయి.

IPL 2023 Punjab vs Kolkata: కోల్ కతా పై వరుణుడి దెబ్బ.. పంజాబ్ దే గెలుపు

IPL 2023 Punjab vs Kolkata: ఐపీఎల్ సీజన్ 16 లో పంజాబ్ కింగ్స్ విజయంతో ఆరంభంచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 7 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్స్ లో 191/5 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ఛేదనకు దిగిన కోల్ కతా కు వరుణుడు అడ్డు తగిలాడు. మరో 4 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుంది అనగా భారీ వర్షం పడింది. దీంతో ఆటను ఆపేశారు. చాలా సేపు ఎదురు చూసినప్పనటికీ వర్షం ఆగకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానంలో పంజాబ్ జట్టును విన్నర్ గా ప్రకటించారు. దీంతో ఈ సీజన్ లో డక్ వర్త్ లూయిస్ విధానంలో గెలిచిన మొదటి జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 01 Apr 2023 08:45 PM (IST)

    డక్ వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ విజయం

    ఐపీఎల్ సీజన్ 16 లో పంజాబ్ కింగ్స్ విజయంతో ఆరంభంచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 7 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్స్ లో 191/5 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ఛేదనకు దిగిన కోల్ కతా కు వరుణుడు అడ్డు తగిలాడు. మరో 4 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుంది అనగా భారీ వర్షం పడింది. దీంతో ఆటను ఆపేశారు. చాలా సేపు ఎదురు చూసినప్పనటికీ వర్షం ఆగకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానంలో పంజాబ్ జట్టును విన్నర్ గా ప్రకటించారు. దీంతో ఈ సీజన్ లో డక్ వర్త్ లూయిస్ విధానంలో గెలిచిన మొదటి జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది.

  • 01 Apr 2023 07:37 PM (IST)

    డక్ వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ కే ఛాన్స్

    ఆట ఆగిపోయే సమయానికి డక్ వర్త్ లూయిస్ ప్రకారం కేకేఆర్ 7 పరుగుల వెనుకబడి ఉంది. ఒక వేళ వర్షం అంతరాయం ఏర్పడి మ్యాచ్ ప్రారంభం కాకపోతే పంజాబ్ గెలుస్తుంది.

  • 01 Apr 2023 07:19 PM (IST)

    రెయిన్ బ్రేక్.. కేకేఆర్ స్కోర్ 146/7

    16 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 146/7. ప్రస్తుతం వర్షం పడుతుండడంతో ఆటకు చిన్న బ్రేక్ పడింది.

  • 01 Apr 2023 07:15 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    అర్హదీప్ మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. వెంకటేష్ అయ్యర్ 28 బాల్స్ లో 34 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 138/7. క్రీజులో నరైన్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.

  • 01 Apr 2023 07:10 PM (IST)

    భారీ వికెట్ కోల్పోయిన కేకేఆర్

    కేకేఆర్ ఓ భారీ వికెట్ కోల్పోయిందనే చెప్పాలి. రసెల్ 19 బాల్స్ లో 35 పరుగులు చేసి రసెల్ ఔట్ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 136/6.

  • 01 Apr 2023 06:45 PM (IST)

    రింకూ వికెట్ కోల్పోయిన కేకేఆర్

    పది ఓవర్లు ముగిసి 11 ఓవర్ మొదటి బాల్ కే రింకూ సింగ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం కేకేఆర్ 80/5. క్రీజులో వెంకటేష్ అయ్యర్, రసెల్ ఉన్నారు.

  • 01 Apr 2023 06:43 PM (IST)

    10 ఓవర్లు: కేకేఆర్ స్కోర్ 80/4

    10 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 80/4.

  • 01 Apr 2023 06:41 PM (IST)

    వరుసగా నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    వరుసపెట్టి కేకేఆర్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. నితీశ్ రాాణా సికిందర్ రాజా బౌలింగ్లో 17 బాల్స్ 24 రన్స్ చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 76/4. క్రీజులో వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ ఉన్నారు.

  • 01 Apr 2023 06:24 PM (IST)

    పవర్ ప్లే ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 46/3

    పవర్ ప్లే ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 46/3. క్రీజులో వెంకటేష్ అయ్యర్, నితీశ్ రాణా ఉన్నారు.

  • 01 Apr 2023 06:20 PM (IST)

    5 ఓవర్లు: కేకేఆర్ స్కోర్ 35/3

    5 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 35/3. ప్రస్తుతం క్రీజులో వెంకటేష్ అయ్యర్, నితీశ్ రాణా ఉన్నారు.

  • 01 Apr 2023 06:17 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్

    వరుసగా బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ చేరుతున్నారు. కేకేఆర్ మూడో వికెట్ ను కోల్పోయింది. 16 బాల్స్ కు 22 పరుగులు చేసి గర్బాజ్ వెనుదిరిగారు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ 29/3

  • 01 Apr 2023 06:03 PM (IST)

    వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా

    ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన అర్హదీప్. 5 బాల్స్ కు 4 పరుగులు చేసి అనుకుల్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్ రెండు ఓవర్లు ముగిసే సరికి 17/2. క్రీజులో గర్బాజ్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు.

  • 01 Apr 2023 05:57 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన నైట్ రైడర్స్

    అర్షదీప్ బౌలింగ్లో 4 బాల్స్ కు 2 పరుగులు చేసి మన్ దీప్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా స్కోర్ 13/1. క్రీజులో గర్బాజ్, అనుకుల్ ఉన్నారు.

  • 01 Apr 2023 05:55 PM (IST)

    కోల్‌కతా బ్యాటింగ్ షురూ

    192 పరుగుల ఛేదనలో బ్యాటింగ్ మొదలుపెట్టిన కోలకతా. క్రీజులో మన్ దీప్ , గర్బాజ్ ఉన్నారు.

  • 01 Apr 2023 05:13 PM (IST)

    ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 191/5

    ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 191/5.

  • 01 Apr 2023 05:05 PM (IST)

    5 వికెట్ కోల్పోయిన పంజాబ్

    పంజాబ్ కింగ్స్ 5 వ వికెట్ కోల్పోయింది. సికిందర్ రాజా కేకేఆర్ బౌలర్ నరైన్ బౌలింగ్లో 13 బాల్స్ కు 16 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇప్పటి వరకు 18.2 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 170/5. క్రీజులో షారుఖ్, ఎస్ కరన్ ఉన్నారు.

  • 01 Apr 2023 04:48 PM (IST)

    15 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 143/4

    15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ స్కోర్ 143/4.  క్రీజులో సికిందర్ రాజా, ఎస్ కరన్ ఉన్నారు.

  • 01 Apr 2023 04:46 PM (IST)

    కెప్టెన్ వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్

    పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్.. కేకేఆర్ బౌలర్ చక్రవర్తి బౌలింగ్లో 14.3 ఓవర్లో 29 బాల్స్ కు 40 పరుగులు చేసి ఔట్ అయ్యారు. క్రీజులో సికిందర్ రాజా, ఎస్ కరన్ ఉన్నారు. ఇప్పటి వరకు పంజాబ్ స్కోర్ 143/3

  • 01 Apr 2023 04:40 PM (IST)

    3 వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్

    జితేష్ శర్మ 11 బాల్స్ లో 21 పరుగులు చేసి సౌథీ బౌలింగ్లో ఔట్ అయ్యారు. క్రీజులో థావన్, సికిందర్ రాజా ఉన్నారు. ఇప్పటి వరకు 13.4 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 139/3.

  • 01 Apr 2023 04:28 PM (IST)

    11 ఓవర్లు: మరో వికెట్ కోల్పోయిన పంజాబ్.. రాజపక్స ఔట్

    మరో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్. రాజపక్స ఔట్. ఇప్పటి వరకు స్కోర్ 109/2. క్రీజులో థావన్, జితేష్ శర్మ ఉన్నారు.

  • 01 Apr 2023 04:26 PM (IST)

    రాజపక్స హాఫ్ సెంచరీ

    30 బంతులకు 50 పరుగులు చేసిన రాజపక్స. 10.4 ఓవర్లకు ముగియగా ఇప్పటివరకూ స్కోర్ 109/1

  • 01 Apr 2023 04:22 PM (IST)

    10 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 100/1

    10 ఓవర్లకగానూ పంజాబ్ కింగ్స్ స్కోరు 100/1గా ఉంది. శిఖర్ ధావన్ 28, రాజపక్స 46 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 01 Apr 2023 04:09 PM (IST)

    5 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 50/1 

    5 ఓవర్లకగానూ పంజాబ్ కింగ్స్ స్కోరు 50/1గా ఉంది. శిఖర్ ధావన్ 10, రాజపక్స 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 01 Apr 2023 04:07 PM (IST)

    వికెట్ కోల్పోయిన పంజాబ్

    పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్ లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్  రెండో ఓవర్లో ఔటయ్యాడు. ఇప్పటి వరకు పంజాబ్ స్కోరు  3 ఓవర్లకు 24/1గా ఉంది.

  • 01 Apr 2023 04:05 PM (IST)

    బ్యాటింగ్ కు దిగిన పంజాబ్

    పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా ప్రభ్‌సిమ్రాన్ సింగ్,  శిఖర్ ధావన్ బరిలోకి వచ్చారు.