Asia Cup 2022: భారత జట్టు ఆఖరి ఆట.. నేడు భారత్ వర్సెస్ ఆఫ్ఘాన్
ఆసియా కప్పు టైటిలే ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు. అనుకోకుండా ఫైనల్ కు దూరమైయ్యింది. కాగా ఫైనల్స్ దూరమైనా తన పరాజయాన్ని చూపించకుండా లాస్ట్ మ్యాచ్ గెలవడంతోనైనా కొంత విజయ ఊరటను పొందాలని అనుకుంటుంది. నేడు టీంఇండియా ఆఫ్ఘాన్ తో తలపడనుంది.
Asia Cup 2022: ఆసియా కప్పు టైటిలే ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు. అనుకోకుండా ఫైనల్ కు దూరమైయ్యింది. కాగా ఫైనల్స్ దూరమైనా తన పరాజయాన్ని చూపించకుండా లాస్ట్ మ్యాచ్ గెలవడంతోనైనా కొంత విజయ ఊరటను పొందాలని అనుకుంటుంది. నేడు టీంఇండియా ఆఫ్ఘాన్ తో తలపడనుంది.
ఫైనల్‌కు దూరమై క్రికెట్ అభిమానులను నిరాశపరిచిన భారత జట్టు ఆసియా కప్-2022లో తన ఆఖరి మ్యాచ్ కి సిద్ధమైంది. నేడు దుబాయ్ వేదికగా టీంఇండియా అఫ్గానిస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఫైనల్ దారులు ఎలాగూ మూసుకుపోయినా, కనీసం లోపాలన్నా సరిదిద్దుకుని జట్టుగా నిలబడాలని టీమ్‌ఇండియా భావిస్తుంది. కాగా గత రెండు మ్యాచ్ లలోనూ రోహిత్ సేన తమ సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందనే చెప్పుకోవచ్చు. వరుసగా పాకిస్థాన్, శ్రీలంక చేతుల్లో ఓడిపోయి నిరాశ చెందిన టీంఇండియా జట్టు నేడు ఆఫ్ఘనిస్థాన్ తో ఏమేరకు తలపనుందో వేచి చూడాలి.
పేరిన్నికగన్న ఆడగాళ్లకు కొదవలేని టీం ఇండియా ఆసియా కప్ 2022లో అనుకున్నరీతో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. చిన్న జట్టే అయినా అఫ్గానిస్థాన్ ఆత్మవిశ్వాసంతో అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతుంది. షీద్ ఖాన్, ముజీబ్, జద్రాన్, మహ్మద్ నబి, వంటి టీ20 ఆటగాళ్లున్న అఫ్గాన్‌కు ఏ జట్టుకైనా పోటీగా నిలువ గల సామర్థ్యం ఉందని ఇప్పటికే నిరూపించుకుంది.