Hair Growth Tips: ఉసిరి ఐస్ క్యూబ్స్ జూస్.. జుట్టు వేగంగా బలంగా పెరగాలంటే ఇది తాగాల్సిందే

Ice Amla Cubes Juice For Hair Growth Tips In Telugu: జుట్టు ఎంత ఉంటే అంత అందం, నెరవకుండా ఉంటే మరింత అందం. ముఖ్యంగా మహిళల్లో జడ ఎంత పెద్దగా ఉంటే అంత సౌందర్యరాశి అని కవులు పొగుడుతారు. అలాంటి జుట్టు నేటి పొల్యూషన్ ప్రపంచంలో సన్నబడుతోంది. జుట్టును రక్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్నింటినీ చేస్తున్నారు. అయితే అన్నింటికంటే ముఖ్యమైన ఉత్తమమైన ఉసిరి అని ఆయుర్వేదం చెబుతోంది. ఉసిరిని వాడటం వలన జుట్టుకు కావలసిన సి విటమిన్ లభిస్తుంది.
జుట్టు వేగంగా మూడురేట్లు ఎలా పెరగాలో అందుకు కావలసినవి ఏమిటో తెలుసుకుందాం. ఉసిరితో ఐస్ క్యూబ్స్ గా చేసుకుని జ్యూస్ లాగా తాగడం ఒక పద్దతి అందుకు కావలసినపదార్థాలు ఉసిరి ముక్కలు, అల్లం, కరివేపాకు, ఓ నిమ్మకాయ. వీటితో జ్యూస్ చేసి ఆపై ఐస్ క్యూబ్స్ గా మార్చి వాడుకోవాలి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
View this post on Instagram
కొన్ని ఉసిరి కాయల్ని ముక్కలుగా తీసుకుని వాటికి సరిపడా అల్లం, కరివేపాకు, అందులో నిమ్మరసం పిండి మిక్స్ జార్ లో వేసి గ్రాండ్ చేసుకోవాలి. ఆపై వడబోసి జ్యూస్ ను ఐస్ ట్రేలోవేసి 8 గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. దీంతో అది క్యూబ్స్ గా మారుతుంది. ఆ క్యూబ్స్ ను గ్లాస్ లో తీసుకుని అందులో గోరువెచ్చని నీరు పోసుకుని సరిపడా రాక్ సాల్ట్ వేసుకుని తాగాలి. క్రమం తప్పకుండా తాగినట్లయితే జుట్టు బలంగా తయారవుతుంది. ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ప్రతీ రోజు ఐదారు క్యూబ్స్ వాడుకోవచ్చు. ఒక సారి ట్రే నిండా క్యూబ్స్ చేసుకుంటే రెండు మూడు రోజులకు వస్తుంది. చుండ్రుచ దురద లాంటి సబస్యలు పరిష్కారమై గ్రోత్ పెరుగుతుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. హెయిర్ హెల్దీగా ఉండేలా చూస్తాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి కొల్లాజెన్ అవసరం. ఉసిరితో ఎక్కువగా కొల్లా విడుదలై జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.