Manchu Manoj: ‘కన్నప్ప’ హార్డ్ డ్రైవ్ మిస్సింగ్‌పై మంచు మనోజ్ రియాక్షన్!

Manchu Manoj Reaction on Kannappa Hard Disk Missing: మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ హార్డ్ డిస్క్ పోయిందనే వార్త ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. సినిమా రిలీజ్‌కు ఇంక కొన్ని రోజులే ఉందనగా.. అది మిస్సవ్వడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికే ఎన్నో వాయిదాల తర్వాత కన్నప్ప జూన్ 27కి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎట్టకేలకు మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యిందని అభిమానులంత ఖుష్ అవుతున్న తరుణంలో ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్ పోయిందనే వార్తల బయటకు వచ్చింది.
ముంబైలో ఓ సీజీ కంపెనీ కోసం ఫుటేజ్‌ని పంపిస్తే.. దాన్ని ఏడిట్ చేసి హైదరాబాద్‌కు కొరియర్ చేశారు. డెలివరి తర్వాత అది పోయిందనేది కన్నప్ప టీం పేర్కొంది. అయితే ఇటీవల చెన్నై ప్రెస్ మీట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ఆ హార్డ్ డిస్క్ తన తమ్ముడి దగ్గర పని చేసే ఇద్దరు వ్యక్తులు తీశారని ఆరోపించారు. ఇది వారు కావాలని తీశారా? ఎవరైనా చెబితే తిశారనేది క్లారిటీ లేదన్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ దానికి తీయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హార్డ్ డ్రిస్క్ వ్యవహారంపై మనోజ్ స్పందించాడు.
మనోజ్ నటించి చిత్రం ‘భైరవం’ విడుదలైంది. మే 30న విడుదలైన ఈ చిత్రం మొదట మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్‌గా ఈ సినిమా హిట్ ట్రాక్‌లో పడింది. దీంతో భైరవం టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా భైవరం టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. దీనికి మంచు మనోజ్, బెల్లంకోండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌తో పాటు డైరెక్టర్ ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్‌కు హార్డ్ డిస్క్ మిస్సింగ్‌పై ప్రశ్న ఎదురైంది.
కన్నప్ప హార్డ్ డిస్క్ పోయిందని వార్తలు వచ్చింది. అదీ మీకు తెలుసు. అది మీ దగ్గరే ఉందని అంటున్నారు.. ఉంటే ఇవ్వోచ్చు కదండి అంటూ ఓ రిపోర్టర్ మనోజ్‌ని సరదాగా ప్రశ్నించారు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ సటైరికల్ కామెంట్స్ చేశాడు. ‘మీకు ఇచ్చాను ఎక్కడుంది అది.. ఆ రోజు మీరే కదా తీసుకున్నారు’ అంటూ రిపోర్టర్‌కే ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఇక సినిమా గురించి మాట్లాడుకుందాం.. ఒకప్పుడు సరదాగా ఫన్ చేశాను.. కానీ, ఒక సినిమా కోసం ఎంతోమంది కష్టపడతారు. ఆ విషయంలో సారీ కూడా చెప్పాను. అయితే, భైరవం సక్సెస్, పాజిటివిట్ వైబ్, సక్సెస్ సెలబ్రేషన్స్ చూసి నన్ను బాధపెట్టాలని చూస్తున్నారు. కానీ ఇంతమంది ప్రేమ ముందర నాకు అది కనిపించడం లేదు. అది నన్ను బాధపెట్టడం లేదు. వాటిపై ఇప్పుడ నేనేం మాట్లాడాలనుకోవడం లేదు. ఏదేమైన కన్నప్ప మూవీ గోప్ప విజయం సాధించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చాడు.