Shubman Gill as New Test Captain?: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్? ఎంపికపై చర్చ..!

Shubman Gill likely to as a New Test Captain for Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా కెప్టెన్ ఎవరు? అనే చర్చ కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగగా, ట్రోఫీ సందర్భంగా హిట్‌మ్యాన్ తొలి టెస్టులకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. తాజాగా టెస్టులకు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్..
వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. వైస్ కెప్టెన్ ఎంపిక విషయంలో బీసీసీఐకి స్పష్టత ఉందని తెలుస్తున్నది. రిషబ్ విదేశీ పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉంది. మరో వైపు బుమ్రా పేరును కెప్టెన్, వైస్ కెప్టెన్‌కు పరిశీలించినా ఫిట్‌నెస్ ఇబ్బందికరంగా మారుతోంది. తరుచూ గాయాల బారినపడుతున్న నేపథ్యంలో ఆడుతాడో లేదో తెలియని పరిస్థితి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో 42 కంటే ఎక్కువ సగటు ఫార్మాట్‌లో పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ పంత్ ఒకడు. ఆయా దేశాల్లో 7సార్లు 90-99 మధ్య పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్ టూర్‌కు ఈ నెల 23న జట్టు ఎంపిక..
బుమ్రాకు భారత్ జట్టుకు కెప్టెన్ ఇవ్వకుండా వైస్ కెప్టెన్‌గా పేరును ప్రతిపాదించడంలో అర్థం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లుగా పీటీఐ పేర్కొంది. శుభ్‌మన్ గిల్ తనను తాను మెరుగుపరుచుకునేందుకు ఇంగ్లాండ్‌లో అతడికే జట్టు పగ్గాలు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇంగ్లాండ్ టూర్ కోసం బీసీసీఐ ఈ నెల 23న భారత జట్టును ప్రకటించనున్నది. అప్పుడే కెప్టెన్ ఎవరో స్పష్టత వస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.