IND vs SA: ఘోరంగా విఫలమైన భారత బ్యాటర్లు.. సఫారీల టార్గెట్ @134
పెర్త్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ మొదటి నుంచి తడబడుతూ ఆడిన భారత బ్యాటర్ల టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. సఫారీల బంతుల ధాటికి టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయింది. కాగా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీం ఇండియా 133 పరుగులు చేసింది.
IND vs SA: పెర్త్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ మొదటి నుంచి తడబడుతూ ఆడిన భారత బ్యాటర్ల టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. సఫారీల బంతుల ధాటికి టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయింది. కాగా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీం ఇండియా 133 పరుగులు చేసింది.
ఓపనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అత్యల్ప స్కోరుతోనే పెవిలియన్ బాటపట్టారు. రోహిత్ (15), కేఎల్ రాహుల్ (9) పరుగు మాత్రమే చేశారు. ఈ మ్యాచ్ లో కూడా విరుచుకుపడతాడని ఊహించిన విరాటుడు సైతం చేతులెత్తేశారు. కేవలం 12 పరుగులు తీసి ఔట్ అయ్యాడు. తర్వాత బరిలోకి దిగిన దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా ( 2)లు వెంటవెంటనే ఔటయ్యారు. దానితో 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 60 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత పిచ్ పై రాణించిన సూర్యకుమార్ 68 పరుగులు అందించాడు. దినేశ్ కార్తీక్ (6) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అశ్విన్ (7) కూడా విఫలమయ్యాడు. టాప్‌ఆర్డర్లు, మిడిలాడర్లు విఫలమైన వేళ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేసి జట్టుకు కాస్త గౌరవప్రదమైన స్కోరును యాడ్ చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కాగా సఫారీల ముందు 134 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
ఇదీ చదవండి: ఎల్లలుదాటిన అభిమానం కోహ్లీ సొంతం.. పాక్ లో విరాట్ కి సైకత శిల్పం