Published On:

LRS : ఈ నెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు పొడిగింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు

LRS : ఈ నెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు పొడిగింపు.. ప్రభుత్వం ఉత్తర్వులు

Layout Regularization Scheme (LRS) : లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును మొదట మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.

 

సాంకేతిక సమస్యలు తలెత్తడమే కారణం..
సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రజల నుంచి స్పందన లేకపోవడం పథకం అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో రాయితీ గడువును మళ్లీ మళ్లీ పొడిగిస్తున్నట్లు తెలిసింది. 2020లో ప్రారంభమైన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఫీజు చెల్లించిన వారిలో 40శాతం మందికి అధికారులు ప్రొసీడింగ్స్‌ కాపీలు ఇచ్చారు.

 

రూ.1,863 కోట్ల ఆదాయం..
5.19 లక్షల మంది మాత్రమే ఏప్రిల్‌ 30వరకు చెల్లింపులు పూర్తిచేశారు. పథకం ద్వారా రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆశించింది. ఇప్పటివరకు రూ.1,863 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత మంది దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు గడువును జూన్‌ వరకు పొడిగించే యోచనలో ఉన్నది.

ఇవి కూడా చదవండి: