Sand Art Of Virat Kohli: ఎల్లలుదాటిన అభిమానం కోహ్లీ సొంతం.. పాక్ లో విరాట్ కి సైకత శిల్పం
భారత బ్యాటింగ్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అయితే చిరకాల ప్రత్యర్థి, దాయాదీ దేశం అయిన పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు వీరాభిమానులున్నారండోయ్. పాక్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు.
Sand Art Of Virat Kohli: భారత బ్యాటింగ్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఏ వేదికలో మ్యాచ్ జరిగినా కోహ్లీ అభిమానులు సందడి చెయ్యండం చూస్తూనే ఉంటాం. అతడి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చూస్తే కూడా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో అనే విషయం తెలిసిపోతుంది. ఇకపోతే చిరకాల ప్రత్యర్థి, దాయాదీ దేశం అయిన పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు వీరాభిమానులున్నారండోయ్. పాక్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి. కోహ్లీపై తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు.
ఆర్‌ఏ గద్దాని అనే సైకత శిల్పి భారీ స్థాయిలో విరాట్ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దాడు. దీన్ని చూసిన చాలా మంది ఆయన్ను తెగ మెచ్చుకుంటున్నారు. కాగా ఈ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పాక్ యాక్టివిస్ట్ ఫాజిలా బలోచ్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23న జరిగిన మ్యాచ్ లో భారత్, పాక్ తలపడగా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమ్‌ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ (82*) వీరోచిత పోరాటం చేసి భారత్ ను ఆఖరి బంతికి గెలుపొందేలా చేశాడని చెప్పవచ్చు. కోహ్లీ కెరీర్‌లో ఈ మ్యాచ్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ విజృంభించాడు.
Here is the video made by Sameer Shoukat @mr_lovely47 from Gaddani, Balochistan.
The team is fan of Virat Kohli @imVkohli, made this amazing portray of #ViratKohli𓃵 using sand art to show his love for the greatest cricketer of our time.
Please share 🙏. pic.twitter.com/eA4meY4T9M
— Fazila Baloch🌺☀️ (@IFazilaBaloch) October 29, 2022
A fan of Virat Kohli @imVkohli, from Balochistan made this amazing portray of #ViratKohli𓃵 using sand art to show his love for the greatest cricketer of our time. pic.twitter.com/GlHvI7ALwA
— Fazila Baloch🌺☀️ (@IFazilaBaloch) October 28, 2022
ఇదీ చదవండి: భారత పురుషులు మరియు మహిళా క్రికెటర్లకు సమాన వేతనం.. బీసీసీఐ