Published On:

SRH Vs KKR Updates: సన్ రైజర్స్ బ్యాటింగ్.. పునకాలు లోడింగ్స్!

SRH Vs KKR Updates: సన్ రైజర్స్ బ్యాటింగ్.. పునకాలు లోడింగ్స్!

IPL- 2025 SRH Vs KKR Updates: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆటగాళ్లు పాత రోజుల్ని గుర్తుచేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు పూనకం వచ్చినవారిలా కొడితే ఫోర్, లేదా సిక్సర్ అనే చందంగా ఆడారు. క్లాసన్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఎప్పటిలా విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. దీంతో అభిషేక్ శర్మ కూడా 16 బంతుల్లో 32 పరుగుల చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేవరకు హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.

 

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ ఆటగాళ్లు తమ నిర్ణయం కరెక్ట్ అని నిరూపించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతూ.. మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చినా.. తర్వాత పరుగుల సునామి వస్తుందని కోల్ కత్తా బౌలర్లు అనుకోలేదు. మూడు ఓవర్లు ముగిసే వరకు స్కోర్ 39కి చేరింది. వీరి ధాటికి పవర్ ప్లే ముగిసే సమయానికి సన్ రైజర్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. 7 ఓవర్లలో నరైన్ వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఔటయ్యాడు.

 

అయితే అభిషేక్ శర్మ ఔటైనా ఆనందం కోల్ కత్తా బౌలర్లకు ఎక్కవసేపు నిలవలేదు. ప్రళయం వస్తుందని వారు ఊహించలేదు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన క్లాసిన్ హెడ్ తో కలిసి వీరవిహారం చేశారు. ఇద్దరు బ్యాటర్లు పోటీ పడి మరి బౌండరీలు, సిక్సర్లు కొట్టారు. 13 ఓవర్లో హెడ్ ను నరైన్ ఔట్ చేసి కాస్త ఊరట కల్పించాడు. హెడ్ ఔటైనా క్లాసెన్ ఇషాన్ కిషన్, అనికేత్ వర్మతో కలిసి పరుగుల వరద పారించాడు. కేవలం 37 బంతుల్లో 105 సాధించాడు. కోల్ కత్తా బౌలర్లలో నరైన్ రెండు, వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకున్నారు.