‘Thug Life’ Release in Karnataka: కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదల చేయాల్సిందే: సుప్రీంకోర్టు
Supreme Court Ordered Karnataka on Thug Life Movie Release: కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని, అది ప్రభుత్వ బాధ్యతని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సినిమాను విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని, అలాగే మూవీ రిలీజ్ ను అడ్డుకుంటున్న వారిని కంట్రోల్ చేయాలని, అందుకు తగిన యాక్షన్ ప్లాన్ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
కాగా తమిళం భాష నుంచే కన్నడ భాష పుట్టిందని హీరో కమల్ హాసన్ మూవీ ప్రమోషన్స్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో రిలీజ్ చేయకుండా అడ్డుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కమల్ హాసన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. సినిమాను తప్పకుండా రిలీజ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సినిమా రిలీజ్ ను అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆందోళనకారులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ మేరకు థియేటర్లకు రక్షణ కల్పించనున్నట్టు కర్ణాటక సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది.