Siddaramaiah: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు.. ఐదేళ్లూ నేనే కర్ణాటక సీఎం

Siddaramaiah Sentaional Comments about CM: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లూ నేనే సీఎంగా ఉంటానని ప్రకటించారు. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పారు. అవును నేనున సీఎంను. మీకు ఏమైనా సందేహం ఉందా అని ప్రశ్నించారు. త్వరలో మార్పు వస్తుందని బీజేపీ, జేడీఎస్ చెబుతున్న విషయాన్ని అడగగా.. వీళ్లేనా మా హైమాండ్ అని సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉండగా, తన వద్ద 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యే ఇక్భాల్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డీకేనే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. అయితే డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకుంటున్నా 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఇక్భాల్ అన్నారు.