Published On:

Karnataka: కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మృతి

Karnataka: కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మృతి

Five tigers die on Karnataka-Kerala Border: కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మృతిచెందాయి. మలై మహదేశ్వర వైల్డ్‌ లైఫ్‌ డివిజన్‌‌లో తల్లి పులి, నాలుగు కూనలు మృతిచెందగా, వాటికి సమీపంలో ఆవు కళేబరాన్ని అధికారులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్ల పులులు మృతిచెందినట్లు తెలుస్తోంది. టైగర్‌ రిజర్వ్‌ లోపల పశువులను మేపుతున్న స్థానికుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

మృతిచెందిన పులి కొన్ని రోజుల కింద ఒక ఆవును చంపినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ కొపంతోనే సమీప గ్రామస్తులు ఆవు కళేబరంలో విషం కలిపి పులికి ఎర వేసి ఉంటారని భావిస్తున్నారు. కళేబరం తిన్న పులులు మృతిచెంది ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. శవపరీక్షలో విష ప్రయోగం వల్ల చనిపోయినట్లుగా తేలిందని పేర్కొన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.

 

ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో రెండో స్థానంలో పులుల సంఖ్య కర్ణాటకలో ఉంది. సర్కారు స్థాయిలోనే పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. అయినా గ్రామీణ ప్రజలు తమ పశు సంపదను కాపాడుకోవడానికి మృగాలపై విష ప్రయోగానికి వెళ్తున్నట్లు అటవీశాఖ గుర్తించింది.

ఇవి కూడా చదవండి: