Published On:

Karnataka: ఆవును చంపిందనే కోపంతో పులులకు విషప్రయోగం.. ముగ్గురు అరెస్టు

Karnataka: ఆవును చంపిందనే కోపంతో పులులకు విషప్రయోగం.. ముగ్గురు అరెస్టు

Three people Arrested: తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కేసును దర్యాప్తు చేస్తున్న అటవీశాఖ అధికారులు పులులకు విషం పెట్టి చంపిన ఓ వ్యక్తితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన మాదురాజు అనే వ్యక్తి తన ఆవును పులి వేటాడి, చంపినందుకు ప్రతీకారంగా అక్కడ తిరిగే పులులకు విషం పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

తాము ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కెంచి అనే ఆవును ఇటీవల అడవిలో ఓ పులి వేటాడి చంపడంతో ఆవేదనకు గురైన మాదురాజు అడవిలోని క్రూరమృగాలను చంపాలని పథకం వేశాడని అధికారులు తెలిపారు. అతడి స్నేహితులు కోనప్ప, నాగరాజుల సహాయంతో చనిపోయిన తన ఆవు కళేబరంపై విషం చల్లి దానిని అడవికి సమీపంలో పడేసినట్లు తెలిపారు.

 

విష కళేబరాన్ని తిన్న ఓ తల్లి పులి, నాలుగు కూనలు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు. దీంతో మాదురాజుని అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారణ కోసం మీణ్యం ప్రాంతంలోని అరణ్య భవన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఘటనపై నివేదిక అందిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు సూచించారు.

ఇవి కూడా చదవండి: