Home / Bengaluru Stampede
Karnataka Government: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కారణమని కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పోలీసుల అనుమతి లేకుండా ఆర్సీబీ ప్రజలను ఆహ్వానించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలిపింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు నివేదికను బహిర్గతం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ప్రభుత్వ నివేదిక […]
Bengaluru Stampede: ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. దానిని ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. విశ్రాంత న్యాయమూర్తి జాన్ మైఖెల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ పలు లోపాలను గుర్తించింది. ఈవెంట్‌ను నిర్వహించడం […]
BCCI Takes Crucial Decision on Bengaluru Stampede: ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం టైటిల్ గెలుచుకున్న బెంగళూరు జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో భారీగా విజయోత్సవాలు చేయాలని డిసైడ్ అయింది. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేయాలని నిర్ణయించింది. అయితే వేడుకలు జరుగుతున్న సమయంలోనే స్టేడియం బయట భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య […]
Karnataka CM Siddaramaiah on Over Bengaluru Stampede: ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతికి బాధ్యత వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతల డిమాండ్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తనను రాజీనామా అడిగే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలుచోట్ల గతంలో జరిగిన విషాదాలకు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా […]
Karnataka Government: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్బంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ, బీసీసీఐ ప్రధాన కారణమని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీకి ఫ్రాంఛైజీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరలేదని సర్కార్ వెల్లడించింది. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసులను సవాల్ చేస్తూ ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. జస్టిస్ ఎస్ఆర్ […]
Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలక పరిణామం నెలకొంది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెటవర్క్స్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ర్యాలీకి పెద్దఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారని ఆరోపిస్తూ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్ లో పేర్కొంది. స్టేడియంలో […]
ArrestKohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఘటనపై దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఘటన జరిగిందని కొందరు, పోలీసులు సరైన భద్రత ఏర్పాటు చేయలేదని ఇంకొందరు ఇలా ఎవరికి వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఘటనపై సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ […]
RCB marketing head Nikhil Arrested in Bengaluru stampede Issue: ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో తొలి కేసు నమోదు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈవెంట్ నిర్వాహక సంస్థ అధికారులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ముంబైకి వెళ్తుండగా.. బెంగళూరులోని ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విక్టరీ […]
police Officials Suspended: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆర్సీబీ జట్టు విజయోత్సవాల్లో జరిగిన ఘటనతో అధికారులపై చర్యలు తీసుకుంది. పలువురు పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా సస్పెండ్ అయిన వారిలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్ తో పాటు మరో […]
Bengaluru Stampede : ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో 11మంది మృతి చెందారు. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఘటనపై బెంగళూరులోని కబ్బన్ పార్కు పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)తోపాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నేరపూరిత నిర్లక్ష్యం కేసులో సంస్థలను నిందితులుగా […]