Published On:

Flood To Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

Flood To Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

Heavy Flood to srisailam Project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో వరద కాస్త కృష్ణానదికి చేరుకుంటోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోని శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోనుంది.

ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 36,050 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 856.20 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. ఇక ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 92.486 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ క్రమంలోనే శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్ట్ కూడా జలకళ సంతరించుకుంది. దీంతో వరద నీటిని కింద శ్రీశైలం ప్రాజెక్ట్ కు విడుదల చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని పంపుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: