Published On:

Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్.. సీఎం స్టాలిన్ హాజరు

Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్.. సీఎం స్టాలిన్ హాజరు

Nomination For Rajya Sabha: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. జూన్ 4 నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. థగ్ లైఫ్ సినిమా ఈ వెంట్ లో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీంతో రాజ్యసభ నామినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సీఎం స్టాలిన్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ తో పాటు సీనియర్ లాయర్ పీ విల్సన్, తమిళ రచయిత రోకియా మాలిక్ అలియాస్ సల్మా, మాజీ ఎమ్మెల్యే శివలింగం కూడా నామినేషన్ వేశారు.

కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్ హాసన్ ఇండియా కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఇండియా కూటమికి, ఎంఎన్ఎం పార్టీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు రాజ్యసభ సీటు కేటాయించారు. దీంతో కమల్ హాసన్ ఇవాళ నామినేషన్ ఇచ్చారు.