Sonia Gandhi: జనగణన జరగకపోవడంతోనే 14కోట్ల ప్రజలకు నష్టం!
![Sonia Gandhi: జనగణన జరగకపోవడంతోనే 14కోట్ల ప్రజలకు నష్టం!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-13.56.02.jpeg)
Sonia Gandhi Says No clarity when Census will be conducted in Rajya Sabha: లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో తన తొలి జీరో అవర్ జోక్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. కేవలం జనగణన చేయకపోవడంతోనే దాదాపు 14 కోట్ల మంది ప్రజలు నష్టం జరుగుతుందన్నారు. దీంతో వీరంతా ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలు పొందలేకపోతున్నారని వెల్లడించారు.
ఇప్పటికీ 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడంతో చాలామంది నష్టపోతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఇప్పటికైనా వీలైనంత త్వరగా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం ప్రభుత్వం జనగణన చేపట్టాలని కోరారు. 2013 సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టంతో దేశంలో 140 కోట్ల జనాభాకు ఆహార భద్రత కల్పించిందని వివరించారు.
అలాగే, కోవిడ్ సమయంలోనూ లక్షలాది కుటుంబాలను ఆకలి నుంచి రక్షించడంలో ఆహార భద్రతా చట్టం ప్రముఖ పాత్ర పోషించిందని సోనియా గాంధీ అన్నారు. ఆహార భద్రత అనేది ప్రత్యేక హక్కు కాదని, ప్రాథమిక హక్కు అని వెల్లడించారు.
అయితే, 2021లోనే జనగణన నిర్వహణ చేయాల్సి ఉండగా.. అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు ఆలస్యం చేసిందని విమర్శలు చేశారు. జనగణన ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదని, ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టత లేకపోవడం విడ్డూరమంగా ఉందన్నారు.
కాగా, 2021 జనాభా లెక్కల ప్రకారం.. ఆహార భద్రతా చట్టంతో దాదాపు 81.35కోట్ల మంది ప్రజలకు మేలు జరిగిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం వరకు లబ్ధి పొందుతుండగా.. పట్టణాల్లో మాత్రం 50 శాతం వరకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుడికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది.