Modi 3.0: ప్రధాని నరేంద్రమోదీ తన మొదటి సంతకం ఏ ఫైలు మీద చేసారో తెలుసా?
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్‌నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్ ఫైల్‌పై సంతకం చేశారు.
Modi 3.0: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్‌నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్ ఫైల్‌పై సంతకం చేశారు. కాగా మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు సుమారు రూ.20వేల కోట్లు పంపిణి చేస్తారు. కాగా పీఎం కిసాన్ నిధిని 2019లో ప్రారంభించారు. ప్రధానమంత్రిగా మోదీ మూడవ సారి ఆదివారం నాడు బాధ్యతలు చేపట్టారు. వెంటనే రైతుల ఖాతాలోకి పెద్ద ఎత్తున ప్రత్యక్ష నగదు బదిలీ చేశారు. దీన్ని బట్టి చూస్తే తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ కూడా రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం..
రైతుల 17వ ఇన్‌స్టాల్‌మెంట్ ఫైల్‌పై సంతకం చేసిన తర్వాత ప్రధాని మాట్లాడారు. తమ ప్రభుత్వం కిసాన్ కళ్యాణ్‌కోసం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం తాను ఆదివారం నాడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకం రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానని ప్రధాని అన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం వ్యవసాయరంగం పురోభివృద్దికి మరింత కృషి చేస్తామని మోదీ రైతులకు హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) కేంద్రప్రభుత్వం ఈ స్కీంను రైతులను ఆదుకొనేందుకు తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలకు దీని వల్ల లబ్ధి కలుగుతుందన్నారు. ఈ డబ్బుతో వారు వ్యవసాయరంగానికి చెందిన పనులకు లేదా దాని అనుబంధ పనులకు తమ ఇంటి అవసరాలకు వినియోగించుకోవచ్చునని ప్రధాని అన్నారు. కాగా ఈ స్కీం 2019లో లోకసభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు ప్రారంభించారు. ఏడాదికి రూ.6,000 నగదు బదిలీ రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం మూడు వాయిదాల్లో రూ. 2,000 చొప్పున ఆధార్ ఆధారిత రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పీఎం కిసాన్ స్కీం కింద లబ్ధిదారుల ఎంపికను ఆయా రాష్ర్టప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఎంపిక చేస్తాయి. 11 కోట్ల లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం రూ.2.42 కోట్లు పంపిణీ చేసింది. కాగా ఈ స్కీం భూములున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. కాగా రైతుల భూముల వివరాలు పీఎం కిసాన్ పోర్టర్‌లో రైతుల భూముల వివరాలు రికార్డు అయ్యి ఉంటాయి.