Published On:

Pakistani Spy: పాకిస్తాన్ కు ఆర్మీ సమాచారం.. పంజాబ్ లో వ్యక్తి అరెస్ట్

Pakistani Spy: పాకిస్తాన్ కు ఆర్మీ సమాచారం.. పంజాబ్ లో వ్యక్తి అరెస్ట్

Punjab: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, పాక్ ఆర్మీ బేస్ క్యాంపులపై డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు పాకిస్తాన్ చేసిన దాడులను మన రక్షణ వ్యవస్థ చిత్తు చేసింది.

 

అలాగే దేశంలో ఉగ్రవాదం అంతం చేసేలా భద్రతా, నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే భారత్ లో ఉంటున్న దాయది దేశ పౌరులు, అలాగే పాకిస్తాన్ కు అండగా ఉండే వారిపై నిఘా పెట్టింది. వారి కదిలికలను ఎప్పటికప్పడు గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్తాన్ కు భారత్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తున్న పలు గూఢచారులను నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. తాజాగా మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

అయితే భారత ఆర్మీకి చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేసిన గగన్ దీప్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి పాకిస్తాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంబంధాలు ఉన్నట్టు ఆ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ ఇవాళ తెలిపారు. గగన్ దీప్ సింగ్ ఐదేళ్లుగా పాకిస్తాన్ లో ఉన్న గోపాల్ చావ్లాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ, అతని ద్వారా ఐఎస్ఐ గూఢచారులతో పరిచయాలు పెంచుకున్నాడు. భారత ఆర్మీ, సైనికుల కదలికలు, భద్రతా దళాల మొహరింపు, వ్యూహాత్మక ప్రాంతాల గురించి సున్నితమైన సమాచారం పాకిస్తాన్ కు చెప్పినట్టు వెల్లడించారు. అతని మొబైల్ లో 20కి పైగా ఐఎస్ఐ విదేశీ కాంటాక్టులతో సమాచారం పంచుకున్నట్టు అధికారులు గుర్చించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ గూఢచారిగా గగన్ దీప్ సింగ్ పనిచేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.