Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై గిల్ ఆల్ టైమ్ రికార్డు..!

Shubman Gill Smashes Records at Edgbaston: ఇంగ్లాండ్‌తో భారత్ రెండో టెస్ట్ ఆడుతోంది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 587 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకుముందు, తొలి రోజు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసిన భారత్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో డబుల్ సెంచరీతో బ్యాక్ బోన్‌లా నిలిచాడు. గిల్ 269(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులతో అసామన్య ప్రతిభ కనబరిచారు.
అయితే, గిల్ తో పాటు జడేజా(89), సుందర్ (42) సహకారం అందించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. గిల్ మాత్రం సింహంలా సిం ‘గిల్’గా ప్రత్యర్థి బౌలర్లను వేటాడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం అడ్డుగోడలా నిల్చుని ఇంగ్లాండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టేశాడు. టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసి రికార్డుకెక్కాడు. దీంతో టెస్టులు, వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన సచిన్, సెహ్వాగ్, రోహిత్, గేల్ సరసన నిలిచాడు.
అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అలాగే విదేశాల్లో గిల్ చేసిన స్కోర్ 3వ అత్యధికం కావడం విశేషం. సెహ్వాగ్ పాకిస్థాన్ జట్టుపై 309 పరుగులు, రాహుల్ ద్రావిడ్ పాకిస్థాన్‌పై 270 పరుగులతో ముందున్నారు. ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదిన తొలి ఇండియన్, ఆసియా కెప్టెన్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు.